ఆగని మహిళల దారుణ హత్యలు…

ఆగని మహిళల దారుణ హత్యలు…

ఆగని మహిళల దారుణ హత్యలు… బ్రిటన్‌లో భారత సంతతికి చెందిన ఓ మహిళను దుండగులు అతికిరాతకంగా హత్య చేశారు. అనంతరం ఆమె మృతదేహాన్ని సూట్ కేసులో పెట్టి నడిరోడ్డుపై వదిలి వెళ్లారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఆమె భర్తను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. బ్రిటన్‌లోని ఓ కాల్ సెంటర్‌లో కిరణ్ దౌడియా(46) గత పదిహేడేండ్లుగా పని చేస్తున్నారు. అయితే ఆమె సోమవారం విధులకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. మంగళవారం బ్రిటన్‌లోని అలైవేలో రోడ్డుపై ఓ సూట్‌కేసును గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు ఆ సూట్‌కేసును తెరిచి చూడగా అందులో కిరణ్ దౌడియా మృతదేహం ఉన్నది. ఆమె భర్త అశ్విన్ దౌడియానే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడని అనుమానించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. గురువారం కోర్టులో హాజరుపరిచారు. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు.

Read More

కాపాడబోయిన అగ్నిమాపక సిబ్బంది పై కాటువేసిన కాలం….

కాపాడబోయిన అగ్నిమాపక సిబ్బంది పై  కాటువేసిన కాలం….

కాపాడబోయిన అగ్నిమాపక సిబ్బంది పై  కాటువేసిన కాలం…. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో ఓ బహుళ అంతస్థుల భవనంలో మంటలు ఆర్పేందుకు వెళ్లిన 20 మంది అగ్నిమాపక సిబ్బంది భవనం కుప్పకూలడంతో ప్రాణాలను కోల్పోయారు. నగరంలోని సుప్రసిద్ధ కట్టడం ప్లాస్కో భవనంలో గురువారం ఉదయం అగ్ని ప్రమాదం జరిగింది. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఉదయం పెద్దఎత్తున మంటలు చెలరేగడంతో వాటిని అదుపు చేసేందుకు సిబ్బంది భవనంలోకి వెళ్లారు. కొన్ని గంటలపాటు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. భవనంలో ఉన్న దుకాణాల యజమానులు, సిబ్బందిని, ప్రజలను బయటకు పంపేశారు. సహాయక కార్యక్రమాలు కొనసాగుతుండగా సెకండ్ల వ్యవధిలో భవనం కుప్పకూలిపోయింది. దీంతో 20 మంది మరణించారు. మంటలు చెలరేగిన దృశ్యాలు ఇరాన్ స్టేట్ టెలివిజన్‌లో ప్రత్యక్ష ప్రసారమయ్యాయి. ఓ జర్నలిస్ట్ స్థానికులతో మాట్లాడుతుండగా వెనక భవనం కూలుతున్న దృశ్యాలు కనిపించాయి. 17 అంతస్థుల…

Read More

రెడ్ మీ నోట్ 4 వచ్చేసిందోచ్…!

రెడ్ మీ నోట్ 4 వచ్చేసిందోచ్…!

 రెడ్ మీ నోట్ 4 వచ్చేసిందోచ్…! చైనా మొబైల్ మేకర్ షియోమి  క్రేజీ రెడ్ మీ నోట్ 4 కొత్త స్మార్ట్ ఫోన్‌ ను గురువారం భారత మార్కెట్లో రిలీజ్ చేసింది.  రెడ్ మీ నోట్ 3 స్మార్ట్ ఫోన్ తో ఫోన్ లవర్స్ ను విపరీతంగా  ఆకట్టుకున్న షియోమి 2017 ఆర్థిక  సంవత్సరంలో తొలి స్మార్ట్ ఫోన్ ను  ప్రవేశపెట్టింది.   ఢిల్లీలో  అట్టహాసంగా జరిగిన ఆవిష్కరణ కార్యక్రమంలో   ఎంతో కాలంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న  రెడ్ మీ నోట్ 4 ఎలిగెంట్‌ డిజైన్ తో  భారత మార్కెట్‌లో లాంచ్ చేసింది.    మూడు వేరియంట్లలో లాంచ్ చేసిన వీటి ధరలను వరుసగా రూ. 9,999,(2జీబీ) రూ.10,999 (3 జీబీ) ధరను రూ. 12, 999 (4జీబీ) గా కంపెనీ నిర్ణయించింది.  సోమవారం నుంచి ఫ్లిప్ కార్ట్ లో ప్రత్యేకంగా …

Read More

టెలికం రంగంలో 20 లక్షల ఉద్యోగాలు…

టెలికం రంగంలో 20 లక్షల  ఉద్యోగాలు…

టెలికం రంగంలో 20 లక్షల  ఉద్యోగాలు… ఈ ఏడాది టెలికం రంగంలో దాదాపు 20 లక్షల ఉద్యోగాలు లభించవచ్చని ఓ నివేదిక వెల్లడించింది. డేటా వినియోగం భారీగా పుంజుకోవడంతోపాటు కొత్త కంపెనీల రంగ ప్రవేశం, మేక్ ఇన్ ఇండియా, మొబైల్ లావాదేవీలు శరవేగంగా పెరుగుతుండటం వంటి అంశాలు టెలికం ఇండస్ట్రీలో ఉద్యోగావకాశాలు పెరిగేందుకు ప్రధానంగా దోహదపడనున్నాయని రిపోర్టు పేర్కొంది. మొబైల్ హ్యాండ్‌సెట్ తయారీ విభాగంలో కొత్తగా 17.6 లక్షల ఉద్యోగాలు పుట్టుకురావచ్చని, టెలికం సేవల ఆపరేటర్లు మరో 3.7 లక్షల మందిని నియమించుకోవచ్చని టీమ్‌లీజ్, టెలికం సెక్టార్ స్కిల్ కౌన్సిల్ సంయుక్తంగా విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. 5జీ టెక్నాలజీ కూడా రంగ ప్రవేశం చేస్తే, దీర్ఘకాలంలో టెలికం రంగంలో మౌలిక వసతుల విభాగంలో అవకాశాలు భారీగా పుంజుకోవచ్చని రిపోర్టు అంటున్నది. 2020-21కల్లా టెలికం మౌలిక వసతుల విభాగంలో…

Read More

ఓటుహక్కు లేకుంటే నో శృంగారం..!

ఓటుహక్కు లేకుంటే నో శృంగారం..!

ఓటుహక్కు లేకుంటే నో శృంగారం..! ఓటు హక్కు ప్రాముఖ్యతను తెలియజేస్తూ కెన్యాకు చెందిన ఓ మహిళా ఎంపీ వినూత్న ప్రచారం చేపట్టారు. దేశంలోని మహిళలంతా తమ భర్తలు ఓటు హక్కు పొందేవరకు శృంగారానికి అంగీకరించవద్దని పిలుపునిచ్చారు. కెన్యాలోని మొంబాసా తీర నగరానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ మిషీ మోకో ఇటీవల ఓటరు అవగాహన సదస్సులో మాట్లాడుతూ.. భర్తల్లో మార్పు వచ్చేలా దానిని మహిళలు ఆయుధంగా వాడుకోవాలి. తమ భర్తలు ఓటరు కార్డు చూపించే వరకు శృంగారాన్ని నిరాకరించండి. నా భర్తకు ఆ సమస్య లేదు. ఎందుకంటే ఆయనకు ఓటరు కార్డు ఉంది అని చమత్కరించారు. కెన్యాలో ఆగస్టు ఎనిమిదిన పార్లమెంట్ ఎన్నికలు జరుగనున్నాయి. దేశంలో సుమారు 90 లక్షల మంది అర్హత ఉండి ఓటుహక్కు నమోదుకు ఆసక్తి చూపడం లేదు. ఓటరు నమోదు గడువు ఫిబ్రవరి 17తో…

Read More

బెస్ట్ యాక్టర్ అవార్డును డబ్బులిచ్చి కొనుకున్న బాలీవుడ్ యాక్టర్…

బెస్ట్ యాక్టర్ అవార్డును డబ్బులిచ్చి కొనుకున్న బాలీవుడ్ యాక్టర్…

 బెస్ట్ యాక్టర్ అవార్డును డబ్బులిచ్చి కొనుకున్న బాలీవుడ్ యాక్టర్… ప్రముఖ బాలీవుడ్ యాక్టర్ రిషీకపూర్ బెస్ట్ యాక్టర్ అవార్డును డబ్బులిచ్చి కొన్నారట. 1973లో బాబీ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రిషీ కపూర్..ఈ మూవీకి గాను ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్ పురస్కారాన్ని పొందారు. ఈ విషయమై రిషీకపూర్ మాట్లాడుతూ బెస్ట్ యాక్టర్ అవార్డును తాను రూ.30వేలు పెట్టి కొన్నానని, ఆ రోజుల్లో తాను చేసిన ఈ పనికి ఎంతో సిగ్గుపడ్డానని చెప్పుకొచ్చాడు. ఈ పని చేసినపుడు తాను యువకుడినని, అపుడు తన చేతిలో డబ్బులు చాలా ఉండేవన్నాడు. ఆ తర్వాత ఇలాంటి పనులు మరెప్పుడూ చేయలేదని చెప్పాడు రిషీకపూర్.

Read More

విద్యార్దులను బలి తీసుకున్న మంచు…

విద్యార్దులను బలి తీసుకున్న మంచు…

విద్యార్దులను బలి తీసుకున్న మంచు… ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. విద్యార్థులతో వెళ్తున్న పాఠశాల బస్సు, ట్రక్కు ఒకదానినొకటి ఢీ కొన్నాయి. ఈట జిల్లా అలీగంజ్ ప్రాంతంలో జరిగిన ఈ దుర్ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న విద్యార్థుల్లో 24 మంది మృతిచెందగా మరో 30 మంది గాయపడ్డారు. సమాచారం తెలిసిన పోలీసులు, అధికారులు హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రులకు తరలించారు. పొగమంచు కారణగానే ప్రమాదం జరిగిందని యూపీ డీజీపీ జావీద్ అహ్మద్ తెలిపారు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు వెల్లడించారు. దట్టమైన పొగమంచు కారణంగా జిల్లా అధికారులు పాఠశాలలకు సెలవులను ప్రకటించారు. అయినప్పటికీ అధికారుల ఆదేశాలను దిక్కరించి పాఠశాలను తెరిచి నిర్వహిస్తున్నారని తెలిపారు. పాఠశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రమాదంపై ప్రధాని…

Read More

మాలిలో ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడికి 50 మంది దుర్మరణం…

మాలిలో ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడికి 50 మంది దుర్మరణం…

మాలిలో ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడికి 50 మంది దుర్మరణం… ఆఫ్రికన్ దేశమైన మాలిలో బుధవారం ఆత్మాహుతి దాడి జరిగింది. ఉత్తర ప్రాంతంలోని గావో పట్టణంలో శాంతిని పర్యవేక్షిస్తున్న ప్రభుత్వ ఆర్మీ, తిరుగుబాటుదారుల ప్రతినిధులు ఉన్న క్యాంపులో పేలుడు సంభవించింది. కారులో పేలుడు పదార్థాలు నింపుకొని వచ్చిన ఉగ్రవాదులు పార్కింగ్ ప్రాంతంలో పేల్చివేసుకోవడంతో 50 మంది మృతి చెందగా, 100 మందికి పైగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఆ సమయంలో వందల మంది క్యాంపులోకి వస్తుండటంతో మృతుల సంఖ్య భారీగా ఉందన్నారు. పేలుడు జరిగిన ప్రాంతం గావో ఎయిర్‌పోర్టుకు అతి సమీపంలో ఉన్నది. మాలిలో ప్రభుత్వ అనుకూల వర్గాలు, తిరుగుబాటుదారుల మధ్య కొన్నేండ్లపాటు యుద్ధం జరిగింది. 2015లో ఐక్యరాజ్యసమితి చొరవతో వీరి మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా రెండు వర్గాలు సంయుక్తంగా గస్తీ నిర్వహిస్తున్నాయి. దాడిలో…

Read More

ఏటీఎం నుంచి కురిసిన నోట్ల వర్షం…

ఏటీఎం నుంచి కురిసిన నోట్ల వర్షం…

ఏటీఎం నుంచి కురిసిన నోట్ల వర్షం… రాజస్థాన్‌ లాంటి ఎడారి ప్రాంతంలో సాధారణంగా వర్షం కురిస్తేనే అక్కడి ప్రజలు పులకరించిపోతారు.. అలాంటిది నోట్ల వర్షం కురిస్తే. టోంక్ జిల్లా కేంద్రంలో ఓ ఏటీఎంనుంచి నిజంగానే నోట్ల వర్షం కురిసింది. జిల్లా కలెక్టర్ కార్యాలయానికి సమీపంలోని ఓ బ్యాంకులో సాంకేతిక లోపం కారణంగా వంద రూపాయలకు రెండు వేల నోటు వచ్చింది. దీంతో జనం క్యూ కట్టి పెద్ద ఎత్తున డబ్బు డ్రా చేసుకొన్నారు. జితేశ్ దివాకర్ అనే ఖాతాదారుడు కూడా డబ్బు తీసుకొనేందుకు ఆ ఏటీఎంకు వెళ్లాడు. రూ.3500 కోసం యంత్రంలో నంబర్లు కొడితే.. ఏకంగా రూ.70వేలు వచ్చాయి. దీంతో ఆశ్చర్యపోయిన దివాకర్ తన తండ్రికి సమాచారం ఇచ్చి.. ఇద్దరు కలిసి బ్యాంకుకు వెళ్లి ఫిర్యాదు చేశారు. అప్పటికే ఆ ఏటీఎం నుంచి రూ.6.76లక్షలు నగదు డ్రా…

Read More

ముస్లింలకు అండగా ఉంటానన్న సీఎం…

ముస్లింలకు అండగా ఉంటానన్న సీఎం…

ముస్లింలకు అండగా ఉంటానన్న సీఎం… తమిళనాడులో ముస్లింలకు రిజర్వేషన్ కల్పించిన పద్ధతుల్లోనే రాష్ట్రంలోని ముస్లింలకు కూడా 12శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్పష్టంచేశారు. దీనికి కేంద్రం అంగీకరించని పక్షంలో సుప్రీం కోర్టుకు వెళుతామని చెప్పారు. గత ప్రభుత్వాలు మైనారిటీలను పట్టించుకోలేదన్న సీఎం.. తమ ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలోని ముస్లింలకు 12% రిజర్వేషన్ ఇచ్చి తీరుతామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ఇందుకు సంబంధించిన బిల్లును ప్రవేశపెడతామని చెప్పా రు. తమిళనాడు తరహాలోనే మన రాష్ట్ర పరిస్థితులకు అనుగుణంగా, పెరిగిన ముస్లిం రిజర్వేషన్ అమలుచేసుకునేలా బిల్లును రాష్ట్రపతి ఆమోదానికి పంపుతామని స్పష్టంచేశారు. ముస్లింలకు 12% రిజర్వేషన్లు కల్పించాలంటే, మొత్తం రిజర్వేషన్లు 50శాతానికి మించకూడదనే ఆంక్షను ముందుగా సడలించుకోవాల్సి ఉందన్నారు. ఇందుకోసం తమిళనాడు ప్రభుత్వం…

Read More

ఘనంగా అమెరికా నూతన అధ్యక్షుడి ప్రమాణ స్వీకారోత్సవ ఏర్పాట్లు…

ఘనంగా అమెరికా నూతన అధ్యక్షుడి ప్రమాణ స్వీకారోత్సవ ఏర్పాట్లు…

ఘనంగా అమెరికా నూతన అధ్యక్షుడి ప్రమాణ స్వీకారోత్సవ ఏర్పాట్లు… అమెరికా నూతన అధ్యక్షుడి ప్రమాణ స్వీకారోత్సవ ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. మరో రెండు రోజుల్లో (ఈ నెల 20) అమెరికాకు 45వ అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ‘మేక్‌ అమెరికా గ్రేట్‌ ఎగైన్‌’ థీమ్‌తో ఈ వేడుకలను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ట్రంప్‌ రెండు బైబిల్స్‌ మీద ప్రమాణం చేయనున్నారు. ఒకటి మాజీ అధ్యక్షుడు అబ్రహాం లింకన్‌ తొలిసారి అధ్యక్షుడైనపుడు ఉపయోగించిన బైబిల్‌ కాగా, మరొకటి గ్రాడ్యుయేషన్‌ సమయంలో ట్రంప్‌కు తల్లి బహూకరించిన బైబిల్‌. దీంతో అమెరికా అంతట ట్రంప్‌ ఫీవర్‌ పట్టుకుంది. ఈ కార్యక్రమానికి భారతీయ-అమెరికన్లు, హాలీవుడ్‌ ప్రముఖులతో పాటు పలువురు హాజరుకానున్నారు. రేపటి నుంచి అన్ని ప్రాంతాల్లో ట్రంప్‌ ప్రమాణ స్వీకార వేడుకలు అంబరాన్నంటనున్నాయి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేలా కట్టుదిట్టమైన…

Read More

జ‌మ్మూక‌శ్మీర్‌లో భారీగా కురుస్తున్న మంచు…!!

జ‌మ్మూక‌శ్మీర్‌లో భారీగా కురుస్తున్న మంచు…!!

జ‌మ్మూక‌శ్మీర్‌లో భారీగా కురుస్తున్న మంచు…!! జ‌మ్మూ క‌శ్మీర్‌లో భీక‌రంగా మంచు కురుస్తున్న‌ది. దీంతో అక్క‌డ ర‌వాణా రాక‌పోక‌లు స్తంభించాయి. టూరిస్టులు కూడా ఇబ్బందులు ప‌డుతున్నారు. ప‌ట్నీటాప్‌లో కురుస్తున్న మంచు వ‌ల్ల అక్క‌డ నీటి, విద్యుత్తు స‌ర‌ఫ‌రా నిలిచిపోయింది. భారీగా ప‌డుతున్న మంచు వ‌ల్ల జ‌న‌జీవ‌నం కూడా స్తంభించింది. వీలైనంత త్వ‌రగా నీటి, విద్యుత్తు స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని స్థానిక హోట‌ల్ య‌జ‌మానులు డిమాండ్ చేస్తున్నారు. మౌళిక స‌దుపాయాలు లేని కార‌ణంగా టూరిస్టులు అర్థాంతరంగా వెనుదిరిగేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. పూంచ్ జిల్లాలోని ముఘ‌ల్ రోడ్డు ప్రాంతంలో ట‌న్నెల్ నిర్మించాల‌ని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మంచు విప‌రీతంగా కురుస్తున్న‌ప్పుడు ర‌వాణా ఇబ్బందులు త‌లెత్తుతున్నాయ‌ని, ట‌న్నెల్ నిర్మాణంతో స‌మ‌స్య ప‌రిష్కార‌మ‌వుతుంద‌ని ఆశిస్తున్నారు.  

Read More

ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్‌ను కాపాడిన మ‌న్మోహ‌న్‌..

ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్‌ను కాపాడిన మ‌న్మోహ‌న్‌..

ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్‌ను కాపాడిన మ‌న్మోహ‌న్‌.. ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ ఉర్జిత్ ప‌టేల్ ఇవాళ పార్ల‌మెంట‌రీ క‌మిటీ ముందు నోట్ల ర‌ద్దు అంశంపై విచార‌ణ ఎదుర్కొన్నారు. ఆ స‌మ‌యంలో కాంగ్రెస్ నేత ఒక‌రు ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్‌ను సంక్లిష్ట‌మైన ప్ర‌శ్న వేశారు. అప్పుడు మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ వెంట‌నే జోక్యం చేసుకుని దానికి స‌మాధానం ఇవ్వ‌రాద‌ని ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్‌ను అడ్డుకున్న‌ట్లు తెలుస్తున్న‌ది. నోట్ల ర‌ద్దు వ‌ల్ల ప్ర‌స్తుతం విత్‌డ్రా పై ఆంక్ష‌లు విధించారు. ఒక‌వేళ ఆంక్ష‌లు తొలిగిస్తే, గంద‌ర‌గోళం నెల‌కుంటుందా అని కాంగ్రెస్ నేత ప్ర‌శ్నించారు. ఆ ప్ర‌శ్న‌కు బ‌దులివ్వ‌బోయిన ఉర్జిత్ ప‌టేల్‌ను మ‌న్మోహ‌న్ అడ్డుకున్నారు. ఆ ప్ర‌శ్న‌కు స‌మాధానం ఇవ్వొద‌న్నారు. ఆర్బీఐని ఇబ్బందుల్లో ప‌డేసే ప్ర‌శ్న‌ల‌కు బ‌దులు ఇవ్వ‌కూడ‌ద‌న్న ఉద్దేశంతో ఉర్జిత్‌ను బ‌హుశా మ‌న్మోహ‌న్ ఆదుకుని ఉంటార‌ని స్టాండింగ్ క‌మిటీ స‌భ్యులు అభిప్రాయ‌ప‌డ్డారు.

Read More

త్వరలో రాష్ట్రవ్యాప్తంగా 102 వాహనాల సేవలు…

త్వరలో రాష్ట్రవ్యాప్తంగా 102 వాహనాల సేవలు…

త్వరలో గర్భినిలకు 102 వాహనాల సేవలు.. గర్భిణులను దవాఖానకు తీసుకెళ్లేందుకు, ప్రసవం అనంతరం తల్లీబిడ్డలను ఇంటికి చేర్చేందుకు ప్రభుత్వం ప్రారంభించిన 102 వాహనాల సేవలను త్వరలో రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులోకి తేనున్నట్టు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి లకా్ష్మరెడ్డి తెలిపారు. ప్రశ్నోత్తరాల్లో భాగంగా మంగళవారం అసెంబ్లీలో ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, బొడిగ శోభ, కోవ లక్ష్మి, కిషన్‌రెడ్డి, జీవన్‌రెడ్డి, పద్మావతి తదితరులు అమ్మఒడి పథకంపై అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. ఎమ్మెల్యేలు మనోహర్‌రెడ్డి, దుర్గం చిన్నయ్య, సుధీర్‌రెడ్డి, మంచిరెడ్డి కిషన్‌రెడ్డిలు వారివారి నియోజవర్గాల్లో దవాఖానాల స్థాయిని పెంచాలని కోరగా అందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్టు మంత్రి లకా్ష్మరెడ్డి తెలిపారు. కార్మికుల సంక్షేమానికి అన్ని చర్యలు: మంత్రి నాయిని భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని హోం, కార్మికశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు….

Read More

ట్రంప్‌ వ్యాఖ్యలతో అమెరికా స్టాక్ మార్కెట్లు ఢమాల్‌…???

ట్రంప్‌ వ్యాఖ్యలతో అమెరికా స్టాక్ మార్కెట్లు ఢమాల్‌…???

 ట్రంప్‌ వ్యాఖ్యలతో అమెరికా స్టాక్ మార్కెట్లు ఢమాల్‌…??? ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడిగా  గెలిచిన తరువాత జోరు పెరిగిన అమెరికా స్టాక్‌  మార్కెట్లు తాజాగా నష్టాల బాట పట్టాయి.  రెండు రోజుల్లో దేశ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న డొనాల్డ్ ట్రంప్‌ వ్యాఖ్యలతో అమెరికా స్టాక్‌ మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ముగిశాయి.   ముఖ‍్యంగా ఫైనాన్షియల్స్‌, రవాణా సంస్థల షేర్లు డీలా పడటంతో స్టాక్‌ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి.   ముఖ్యంగా ఎన్నికల తరువాత అధిక వడ్డీ రేట్లు అంచనాలతో   భారీగా  లాభపడిన ఎస్‌ & పి 500 ఆర్థిక ఇండెక్స్ 2.3 శాతం పడిపోయింది. జూన్ 27  తరువాత తొలిసారి ఆ స్తాయిలో దిగజారింది.   ఈ నేపథ్యంలో  డోజొన్స్‌ 59 పాయింట్లు(0.3 శాతం) క్షీణించి 19,827 వద్ద ముగియగా, ఎస్‌అండ్‌పీ  అదే  బాటలో నడిచింది.  ఇక నాస్‌డాక్‌ మరింత అధికంగా 0.6…

Read More

యాప్‌ స్టోర్‌ రుసుంను భారీగా పెంచిన యాపిల్..

యాప్‌ స్టోర్‌ రుసుంను భారీగా పెంచిన యాపిల్..

యాప్‌ స్టోర్‌ రుసుంను భారీగా పెంచిన యాపిల్..  స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం యాపిల్‌ తన యాప్‌ స్టోర్‌ ధరలను భారీగా పెంచేసింది. భారత్‌, యూకే,  టర్కీలోని యాప్‌ స్టోర్‌లో రసుంను పెంచుతున్నట్లు సంస్థ ప్రకటించింది. ఇందుకు సంబంధించి ఐఓఎస్‌ యాప్‌ డెవలపర్లకు ఈ-మెయిళ్లు పంపింది. యూరోపియన్‌ యూనియన్‌ నుంచి బ్రిటన్‌ విడిపోయేందుకు జరిగిన బ్రెగ్జిట్‌ రెఫరెండం ఎన్నికల ప్రభావంతో బ్రిటిష్‌ పౌండ్‌ విలువ భారీగా పతనమైంది. డాలర్‌తో పోల్చితే పౌండ్‌ దాదాపు 18.5 శాతం నష్టపోయింది. ఇప్పుడు ఆ లోటును భర్తీ చేసేందుకు యాప్‌ స్టోర్‌ టారిఫ్‌లు పెంచుతున్నట్లు యాపిల్‌ తెలిపింది. ఇప్పటి వరకూ 0.79 పౌండ్‌ ఉంటే ఇకనుంచి 0.99 పౌండ్‌ చెల్లించాల్సి ఉంటుందట. అంటే దాదాపు 25శాతం పెరిగింది. పెంచిన ధరలు ఏడు రోజుల్లో అమల్లోకి వస్తాయని యాపిల్‌ తెలిపింది. భారత్‌.. టర్కీ యాప్‌ స్టోర్లలోనూ…

Read More

కన్న కుతుర్ని హతమార్చిన తల్లి…!!

కన్న కుతుర్ని హతమార్చిన తల్లి…!!

కన్న కుతుర్ని హతమార్చిన తల్లి…!! పాకిస్థాన్‌లో తరచూ జరిగే పరువు హత్యలకు ఈ దారుణ ఉదంతం మరో నిదర్శనం. జీనత్‌ రఫిక్‌ అనే 18ఏళ్ల అమ్మాయిని పెళ్లైన వారం రోజులకే ఆమె తల్లి, సోదరుడు కలిసి అతి కిరాతకంగా హతమార్చిన ఘటన లాహోర్‌లో జరిగింది. జీనత్‌ తన క్లాస్‌మేట్‌ హసన్‌ఖాన్‌ను ప్రేమించింది. తల్లిదండ్రులు వారి వివాహానికి ఒప్పుకోకపోయేసరికి బయటకు వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నారు. పెళ్లైన వారం తర్వాత జీనత్‌ తల్లి పర్వీన్‌ బీబీ కూతురును ఇంటికి రమ్మని ఆహ్వానించింది. వారిని క్షమించామని చెప్పింది. పారిపోయి పెళ్లి చేసుకున్నారని అందరూ అనుకోకుండా ఘనంగా రిసెప్షన్‌ ఏర్పాటు చేస్తామని నమ్మించింది. హసన్‌తో పెళ్లికి ఏమాత్రం అంగీకరించని తల్లి ఇప్పుడు ఇలా మాట్లాడడం జీనత్‌కు ఆశ్చర్యంగానే అనిపించింది. అనుమానపడుతూనే లాహోర్‌లోని ఇంటికి వెళ్లింది. అక్కడ సంబరాల వాతావరణమేమీ కనిపించలేదు. జీనత్‌ ఇంటికి…

Read More

చాగంటి వ్యాఖ్యల పై యాదవ సంఘాల ఆగ్రహం…

చాగంటి వ్యాఖ్యల పై యాదవ సంఘాల ఆగ్రహం…

చాగంటి వ్యాఖ్యల పై యాదవ సంఘాల ఆగ్రహం… ప్రవచనకర్తగా తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితుడైన చాగంటి కోటేశ్వరరావు, తమ కులాన్ని అవమానించారని ఆరోపిస్తూ, అఖిల భారత యాదవ సంఘం ప్రతినిధులు ఏపీ, టీఎస్ లోని వివిధ పోలీసు స్టేషన్లలో కేసులు పెట్టిన సంగతి తెలిసిందే. ఆయన బేషరతుగా క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు చాగంటి ఏం మాట్లాడారన్నది ఓసారి పరిశీలిస్తే, ఇటీవల ఆయన ఓ బహిరంగ వేదికపై ప్రవచనాలు చేస్తున్న వేళ, శ్రీకృష్ణుడి గురించి మాట్లాడారు. “ఆయన పశువుల కాపరి ఇంట్లో పుట్టాడు. ఓ మహా విజ్ఞానవేత్తో, చక్రవర్తి కడుపున పుట్టిన వాడో కాదు. ఇంకా రామచంద్రమూర్తి అయితే, దశరధ మహారాజు కుమారుడిగా పుట్టాడు. కృష్ణుడు… ఏమీ తెలియని వాడు, తలగడిగితే మొల కడగరు, మొల కడిగితే, తల కడగరు… అటువంటి గొల్ల…

Read More

డ్యాన్సర్లతో కలిసి స్టెప్పులేసిన టీడీపీ ఎంపీ..

డ్యాన్సర్లతో కలిసి స్టెప్పులేసిన టీడీపీ ఎంపీ..

డ్యాన్సర్లతో కలిసి స్టెప్పులేసిన టీడీపీ ఎంపీ.. సంక్రాంతి వేడుకలో పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు టీడీపీ ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావు (బాబు) మహిళా డ్యాన్సర్లతో కలిసి చిందులు వేశారు. కృష్ణా జిల్లా కైకలూరులోని తన స్వగృహంలో పార్టీ నేతలు, తన అనుచరులకు సోమవారం రాత్రి బాబు పసందైన మందు, విందు పార్టీ ఇచ్చారు. సినిమా పాటలకు యాంకర్లతో డ్యాన్సులు చేయించారు. ఎంపీ బాబు కూడా డ్యాన్సర్లతో కలిసి స్టెప్పులు వేశారు. భోగి పండుగ మొదలు కోడిపందేలు వేయించిన మాగంటి అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి కూడా వీటికి ఆహ్వానించడం విశేషం.

Read More

భారీగా వ్యవసాయ రంగం కొలువులు…

భారీగా వ్యవసాయ రంగం కొలువులు…

భారీగా వ్యవసాయ రంగం కొలువులు… వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించిన తెలంగాణ ప్రభుత్వం భారీఎత్తున వ్యవసాయ అధికారుల నియామకాన్ని చేపట్టింది. ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయ అధికారుల నియామకాలు లేకపోవడంతో రైతులకు సాగులో సలహాలు ఇచ్చే దిక్కు కూడా ఉండేది కాదు. పురుగుల మందులు అమ్మే షావుకారుల వద్ద రైతులు సలహాలు తీసుకునే పరిస్థితి ఉండేది. బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగంగా వ్యవసాయం కీలకమని భావించిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పెద్దఎత్తున వ్యవసాయ అధికారులను నియమించాలని ఆదేశించారు. రాష్ట్రం ఏర్పడ్డాక ఒకేసారి 1,258 వ్యవసాయ అధికారుల పోస్టులను భర్తీ చేశారు. ఈ మేరకు ఇప్పటికే 311 మంది జాబితాను అధికారులు ప్రభుత్వానికి పంపించారు. మిగిలిన వారి జాబితాను బుధవారం పంపించనున్నారు. నిరుద్యోగులకు భరోసా కల్పించే విధంగా నియామకాలు చేపడుతున్న టీఎస్‌పీఎస్సీని ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు. కోర్టు కేసులలో విజయం సాధించిన…

Read More